మరో కీలక నిందితుడి అరెస్ట్
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక నిందితుడు రంగారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.;

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి కేసులో ఏ-1గా ఉన్న ఓలుపల్లి రంగారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత నిందితుడు రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారని భావించి రంగారావు పరారీలో ఉన్నాడు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై...
అయితే రంగారావు ఎక్కడ ఉన్నాడన్నది ఆరా తీసిన సీఐడీ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు కేసుల్లో రంగారావు కీలక నిందితుడిగా ఉన్నాడు. ఒకటి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కాగా, సత్యవర్థన్ అపహరణ కేసులోనూ నిందితుడిగా రంగారావు ఉన్నాడు. రంగారావును ర విజయవాడ సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలిసింది.