ఏపీలో సీఐడీ సోదాలు.. డిస్టలరీలలో తనిఖీలు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. మద్యం డిస్టలరీలపై ఆకస్మిక దాడులు నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్నారు;

Update: 2024-10-22 07:41 GMT
cid, searches,  liquor distilleries, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. మద్యం డిస్టలరీలపై ఆకస్మిక దాడులు నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని మద్యం డిస్టలరీలలో తనిఖీలను సీఐడీ చేస్తుంది. విజయవాడ చుట్టు పక్కల ఉన్న డిస్టిలరీల్లోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఉదయం నుంచి...
ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని ప్రభుత్వమే విక్రయించడంతో పాటు అక్కడి నుంచే మద్యాన్ని కొనుగోలు చేసింది. మద్యం నాణ్యతపై కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. మద్యం ఆర్డర్, సరఫరా వంటి అంశాలపై డిస్టలరీల వారితో ఆరా తీస్తున్నారు. కొన్ని కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. రేపు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


Tags:    

Similar News