తిరుపతి వాసులకు కొత్త సమస్య.. ఇళ్లిలా కుంగిపోతున్నాయే?
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నగరం నీట మునిగిందనే చెప్పాలి. దాదాపు ఐదు రోజుల పాటు తిరుపతిని వర్షాలు వదల్లేదు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నగరం దాదాపు నీట మునిగిందనే చెప్పాలి. దాదాపు ఐదు రోజుల పాటు తిరుపతిని వర్షాలు వదల్లేదు. దీంతో తిరుపతికి చుట్టుపక్కల ఉండే చెరువులు, కుంటలు నిండి నగరం మీద పడ్డాయి. తిరుపతి వాసులకు ఇప్పడు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉన్నట్లుండి ఇళ్లు భూమిలోకి కుంగిపోతున్నాయి. పునాదులు గట్టిగా వేసిన ఇళ్లు సయితం కుంగిపోతున్నాయి.
కలవరం అందుకే....
దీంతో తిరుపతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎంఆర్ పల్లి, శ్రీకృష్ట నగర్ లతో ఇళ్లు కుంగిపోతున్న సంఘటనలు కలవర పరుస్తున్నాయి. ఇటీవలే ఇక్కడ వాటర్ ట్యాంక్ 25 అడుగుల మేరకు పైకి వచ్చింది. దీంతో ఈ ప్రాంత వాసులు ఇళ్లను ఖాళీ చేసి బయటకు వెళ్లిపోతున్నారు. భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నా, అద్దెకు ఉన్న వారు మాత్రం ఈ ప్రాంతంలో నివాసం ఉండటానికి ఇష్టపడటం లేదు.