పీఆర్సీపై నేడు క్లారిటీ.. ఉద్యోగసంఘాలతో జగన్ సమావేశం

పీఆర్సీపై నేడు క్లారిటీ రానుంది. ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు

Update: 2022-01-06 02:08 GMT

పీఆర్సీపై నేడు క్లారిటీ రానుంది. ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు. పీఆర్సీ, వారి డిమాండ్లపై జగన్ నేరుగా చర్చించనున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా ఒక కొలిక్కి రాలేదు. ఫిట్ మెంట్ పై రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

ఆందోళనకు....
ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమై ఈ నెల 9న తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించాయి. దీంతో జగన్ తో ఉద్యోగ సంఘాల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక శాఖ అధికారులతో ఈరోజు కూడా జగన్ సమావేశమవుతారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి సమావేశానికి అందుబాటులో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందింది.


Tags:    

Similar News