అక్టోబర్ 24 నుంచి విశాఖలోనే జగన్ నివాసం

విశాఖపట్నం నుండి పరిపాలన సాగించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటి నుండో

Update: 2023-08-05 07:02 GMT

విశాఖపట్నం నుండి పరిపాలన సాగించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటి నుండో ప్రయత్నిస్తూ వస్తున్నారు. కొంచెం డేట్స్ అటూ.. ఇటూ.. అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్న ఉద్దేశ్యంతో అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. సీఎం జగన్ అక్టోబర్ 24 నుండి విశాఖలోనే ఉంటానని అన్నారు. రుషికొండ సమీపంలో సీఎం అధికారిక భావన నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది. అక్టోబర్ 24 సమయానికి ఇల్లు పూర్తిగా రెడీ అవ్వచ్చని తెలుస్తోంది. భద్రత సిబ్బంది, సీఎం ఆఫీస్ స్టాఫ్ భవనము పరిసరాలను చూడడానికి వెళుతున్నారు. అక్టోబర్ 24 సమయానికి ఆ భవనంలోకి చేరి పరిపాలన చేస్తారని అంటున్నారు.

జీఎస్ఐ సదస్సులోనే పాలనా రాజధాని విశాఖ అని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుందన్నారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని.. అక్కడే ఉండబోతున్నానని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే అక్కడికి వస్తున్నట్లు జగన్‌ చెప్పారు.


Tags:    

Similar News