రేపు నంద్యాలలో సీఎం జగన్ పర్యటన

ఉదయం 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం బటన్ నొక్కి ..;

Update: 2022-10-16 11:20 GMT
cm jagan nandyal tournew revenue division, chinthoor, andhra pradesh
  • whatsapp icon

సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నంద్యాలకు బయల్దేరుతారు. ఉదయం 10.15 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటారు.

ఉదయం 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేశారు. కార్యక్రమం పూర్తైన అనంతరం మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం జగన్ ఆళ్లగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News