Ys Sharmila : సాయిరెడ్డి రాజీనామా అందుకేనట.. షర్మిల ఏమన్నారంటే?
విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.;

విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ ఏ పని ఆదేశిస్తే...ఆ పని చేయడం..ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని అని అన్నారు. రాజకీయంగా కాదు..వ్యక్తిగతంగా కూడా నతబిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి అని అన్నారు. ఈ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పాడన్న షర్మిల ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు అంటే చిన్న విషయం కాదని అన్నారు.
బీజేపీకి దగ్గరవ్వడానికే...
వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలని షర్మిల కోరారు. జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే ఎందుకు ? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు ? ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారు ? జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని షర్మిల విమర్శలు చేశారు. నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను జగన్ మోసం చేశారన్న వైఎస్ షర్మిల నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడంటూ ధ్వజమెత్తారు. జగన్ బీజేపీ కి దత్త పుత్రుడని, తనను తాను కాపాడుకోవడానికి సాయి రెడ్డిని బీజేపీ కి పంపాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.