వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వివాదం.. ఫ్లెక్సీల చించివేత

ప్రొద్దుటూరులో వైసీపీ నేతల మధ్య వివాదం మళ్లీ రేగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రూపుల మధ్య విభేదాలు ముదిరాయి

Update: 2022-01-14 03:08 GMT

ప్రొద్దుటూరులో వైసీపీ నేతల మధ్య వివాదం మళ్లీ రేగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రూపుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకవర్గం వారు పెట్టిన ఫ్లెక్సీలను మరొకరు చించి వేయడంతో వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్లెక్సీలను ఎవరు చించివేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

పుట్టినరోజు సందర్భంగా....
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ల మధ్య గతకొంత కాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టిన రోజు ఈ నెల 16వ తేదీ కావడంతో ఎమ్మెల్సీ వర్గీయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫొటోలేదని ఎమ్మెల్యే వర్గీయులు వీటిని చించి వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News