తగ్గనున్న వంటనూనెల ధరలు
ఫలితంగా తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ.. వంటనూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక లీటరు వంటనూనె
అమరావతి : ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ఫలితం భారత్ లో వ్యాపారులు మార్కెట్లో ఆయిల్ కృత్రిమ కొరత సృష్టించారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ.. వంటనూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక లీటరు వంటనూనె కొనాలంటే.. సామాన్యుడి జేబుకి చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టాస్క్‌ఫోర్స్‌తో ధరలపై నిఘా, ఆకస్మిక తనిఖీలు, రైతు బజార్లు, మున్సిపల్ మార్కెట్లలో కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే విజయ ఆయిల్స్ విక్రయాలు చేపట్టింది. దాంతో వంటనూనెల ధరలు ఇప్పుడిప్పుడే దిగివస్తున్నాయి.
జనవరి నెలలో లీటర్ రూ.150 నుంచి రూ.175 మధ్య ఉండగా, ఒకేసారి రూ.200వరకు దాటిపోయింది. ఇతర ఆయిల్స్ అయితే రూ.200 నుంచి రూ.265 వరకు పెంచేశారు. ఇలా ధరలు పరుగులు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్టాక్ పరిమితిపై ఆంక్షలు విధించింది. హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఏపిలో రైతు బజార్లు, మున్సిపల్ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వాటిలో విజయ ఆయిల్స్ తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత పదిహేను రోజుల్లో 61,759 లీటర్లు విక్రయించింది. ఈ చర్యలతో ఎమ్మార్పీ కంటే రూ.55 వరకు తగ్గించి విక్రయించేందుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. విజయం రిఫైన్డ్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్ ఆయిల్స్ రూ.170కే అందుబాటులో ఉంచింది.