స్పేస్ సెంటర్ లో కరోనా కలకలం

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది.

Update: 2022-01-04 04:17 GMT

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో కరోనా కలకలం రేగింది. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు వైద్యులకు, పన్నెండు మంది ఉద్యోగులకు కరోనా సోకింది. అయితే వీరికి కరోనానా? లేక ఒమిక్రాన్ అన్నది నిర్ధారించేందుకు వీరి రక్తనమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. ఈ అంతరిక్ష కేంద్రంలో మొత్తం 14 మందికి కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రయోగంపై ....?
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న అందరి ఉద్యోగులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. షార్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేశారు. బయో మెట్రిక్ విధానాన్ని తీసివేశారు. అటెండెన్స్ రిజిస్టర్ లను ఏర్పాటు చేశారు. ఈ నెల చివరి వరాంలో రీ శాట్ ఉపగ్రహ ప్రయోగం చేయాల్సి ఉంది. ఉద్యోగులకు కరోనా సోకడంతో ఈ ప్రయోగంపై నీలినీడలు అలుముకున్నాయి.


Tags:    

Similar News