Mlc Election Result : ఎమ్మెల్సీగా గోపీమూర్తి ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. పీడీఎఫ్ అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. పీడీఎఫ్ అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే అత్యధిక ఓట్లు రావడంతో గోపిమూర్తిని విజేతగా ప్రకటించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఈరోజు కాకినాడ జేఎన్టీయూలో ప్రారంభమయింది. ఈ నెల 5వతేదీన ఉప ఎన్నిక జరిగింది.
సమస్యలపై పోరాడతా....
15,490 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గోపి మూర్తికి 7,745 ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారుల ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఎక్కువ మంది గోపీమూర్తికి అండగా నిలిచారని పీడీఎఫ్ నేతలు చెబుతున్నారు. మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతానని ఆయనతెలిపారు.