MLC ELections Results : నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు కౌంటింగ్ జరగనుంది;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 27వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉపాధ్యయ ఎమ్మెల్సీ ఎన్నిక, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గానికి నేడు కౌంటింగ్ జరగనుంది. అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు త్వరగా వచ్చే అవకాశముంది.
తెలంగాణలోనూ...
ఇక తెలంగాణలోనూ 27న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గానికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పట్టభద్రతుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి చాలా ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధ్యాన్యత ఓట్ల లెక్కింపు చేయాల్సి రావడంతో ఫలితాలు ఈరోజు కొన్ని చోట్ల వచ్చే అవకాశం లేదని కూడా అధికారులు అంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.