నారాయణ సంచలన వ్యాఖ్యలు... వివేకా హత్య కేసులో?

సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యపై ఇక విచారణ అవసరం లేదన్నారు

Update: 2022-02-26 06:50 GMT

హైదరాబాద్ : సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యపై ఇక విచారణ అవసరం లేదన్నారు. ఆయనను చంపింది ఎవరో తెలిసి పోయిందని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరనేది సీబీఐ దర్యాప్తులో తెలిసి పోయిందని చెప్పారు. ఈ హత్యకు వైఎస్ కుటుంబీకులే బాధ్యత వహించాలని నారాయణ కోరారు. సీబీఐ పై కూడా ఎదురు దాడి చేసే పరిస్థితికి వచ్చారంటే రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం.....
పోలీసులు వివేకా హత్య కేసులో నిజానిజాలు తేల్చే కంటే మందు ఆ గుట్టును వైఎస్ కుటుంబీకులే బయటపెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం కారణంగానే ఉక్రెయిన్ లో భారతీయులను స్వదేశానికి తెచ్చుకోలేకపోయామని నారాయణ అభిప్రాయపడ్డారు. కొన్ని నెలలనుంచి యుద్ధం జరుగుతుందని సంకేతాలు కన్పిస్తున్నా భారత ప్రభుత్వం అప్రమత్తం కాలేదని నారాయణ విమర్శించారు. విదేశాంగ శాఖ అసలు పనిచేస్తుందా? అని నారాయణ ప్రశ్నించారు.


Tags:    

Similar News