Tirumala : 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు.. దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

Update: 2024-09-19 02:42 GMT

తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలలో భక్తులు ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారాలతో సంబంధం లేకుండా తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. దర్శనం కూడా ఆలస్యంగా మారుతుంది. క్యూ లైన్లలోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవల వరకూ సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉండేది. కేవలం శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే వారు. కానీ ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుని వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. లడ్డూల తయారీ సంఖ్య ను కూడా పెంచింది. అన్నదానానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం కూడా...
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడమే కారణమని టీటీడీ అధికారులు చెబుతున్నారు. స్పెషల్ దర్శనం కంటే ఉచిత దర్శనం క్యూ లైన్ లో భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. ప్రతి రోజూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుండగా, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,086 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News