Tirumala : భక్తులతో కిక్కిరిసి పోయిన తిరుమల.. లడ్డూ కౌంటర్ల వద్ద కూడా రష్
తిరుమలలో రద్దీ తగ్గడం లేదు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది
తిరుమలలో రద్దీ తగ్గడం లేదు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రాక ఎక్కువ కావడంతో అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వసతి గృహాలు కూడా లభ్యమవ్వడానికి గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మరోవైపు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఎక్కువ కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పందొమ్మిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు శ్రీవారి భక్తులు ఉచితంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. లడ్డూల కౌంటర్ దగ్గర కూడా భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తుండటంతో కౌంటర్లు జారీ సంఖ్య ఎక్కువగా పెంచారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.