Tirumala : నేరుగా దర్శనానికి.. వెయిట్ చేయకుండానే
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. క్యూ లైన్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. భక్తులు వీకెండ్ లోనే ఎక్కువగా తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటుంటారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ను కొనుగోలు చేసిన వారికి రెండు గంటల్లో స్వామి వారి దర్శనం అవుతుంది.
ఆదాయం ఘనమే...
ఈరోజు నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వీలుంది. క్యూ లైన్ల నుంచి నేరుగా భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం ఏడు గంటల్లోనే అవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,082 మంది దర్శించుకున్నారవు. వీరిలో 20,192 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న 4.79 కోట్లు వచ్చింది.