Tirumala : ఆదివారమైనా.. పెద్దగా రద్దీ లేదే
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం, పరీక్షల సీజన్ ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లలో భక్తులు పెద్దగా వేచి ఉండకుండానే భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఎనిమిది గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,965 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుంది.