Tirumala : తిరుమలలో శనివారం కూడా రద్దీ తగ్గడానికి రీజన్ ఇదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. శనివారం అయినా కూడా భక్తులు స్వల్ప సంఖ్యలోనే తిరుమలకు వచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. శనివారం అయినా కూడా భక్తులు స్వల్ప సంఖ్యలోనే తిరుమలకు వచ్చారు. దసరా సెలవులు, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు తిరుమల పర్యటనను అప్పటికి వాయిదా వేసుకుని ఉండవచ్చు. దీంతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు కూడా తిరుమలపై ప్రభావం చూపిందంటున్నారు. సాధారణంగా శనివారం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని అందరూ భావిస్తారు. అందుకే శనివారం నాడు విపరీతమైన రద్దీ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం పెద్దగా రష్ లేకపోవడంతో భక్తులు సులువుగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పెద్దగా కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. వసతి గృహాల కేటాయింపు కూడా వేగంగా వెంట వెంటనే జరుగుతుండటంతో పెద్దగా వేచి ఉండకుండానే గదులను భక్తులు పొందుతున్నారు. అన్నదానం వద్ద కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే కనపడుతుంది.