Tirumala : తిరుమలలో నేడు భక్తుల దర్శనం చేసుకోవాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మాత్రం లేరు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మాత్రం లేరు. దీంతో సులువుగానే తిరుమలలో శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మొన్నటి వరకూ క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఇప్పుడు పెద్దగా వేచి ఉండకుండానే దర్శనాన్ని పూర్తి చేసుకుంటున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల రద్దీ కూడా తగ్గింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మూడు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,320 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,919 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.