Tirumala : తిరుమలకు తుఫాను ఎఫెక్ట్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. పెద్దగా భక్తుల సంఖ్య కనపడటం లేదు;
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. పెద్దగా భక్తుల సంఖ్య కనపడటం లేదు. సోమవారం కావడంతో పాటు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల రాక ఈ రెండు మూడు రోజులు తగ్గే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తుఫాను కారణంగా బుక్ చేసుకున్న వాళ్లు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకునే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. అందుకే తుఫాను తీరం దాటి తిరిగి పరిస్థితి సాధారణమయ్యే వరకూ తిరుమలకు భక్తుల సంఖ్య అంతగా ఉండదని భావిస్తున్నారు.
హుండీ ఆదాయం మాత్రం...
నిన్న తిరుమల శ్రీవారిని 70,349 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,535 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు దర్శన సమయం నాలుగు గంటలు మాత్రమే సమయం పడుతుంది.