Tirumala : తిరుమలలో నేడు రద్దీ ఎలా ఉందంటే? సులువుగానే దర్శనం
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. పెద్దగా రష్ లేదు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ కొద్దిగానే ఉంది;
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. పెద్దగా రష్ లేదు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ కొద్దిగానే ఉంది. తక్కువ కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తుండంతో పాటు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల సంఖ్య కొంత తక్కువగానే ఉంది. అందుకే భక్తులు సులువుగానే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. పెద్దగా ఎక్కువ సమయం వేచి ఉండకుండానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్నారు. వసతి గృహాల వద్ద కూడా పెద్దగా రద్దీ లేదు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద కూడా భక్తులు పెద్దగా కనిపించడం లేదు. అలాగే అన్న ప్రసాదం క్యాంటిన్ వద్ద కూడా భక్తుల తాకిడి తక్కువగానే ఉంది. తిరిగి శుక్రవారం నుంచి రద్దీ ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులకు అత్యంత వేగంగా స్వామి వారిని దర్శంచుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మాడ వీధుల్లోనూ పెద్దగా రష్ లేదు. దీంతో తిరుమలకు నేడు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు దర్శనం మాత్రం చాలా తక్కువ సమయంలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.