Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తుంది

Update: 2024-06-09 02:47 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తుంది. వసతి గృహాలు కోసం గంటల తరబడి భక్తులు వెయిట్ చేయాల్సి వస్తుంది. వేసవి సెలవులు ముగియనుండటం, వాతావరణం చల్లబడటంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో పాటు ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

దర్శనానికి...
నిన్న తిరుమల శ్రీవారిని 79,398 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 43,557 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News