Tirumala : ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. రీజన్ ఇదే
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
Tirumala:తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. నిన్నటి వరకూ క్యూ లైన్లీ ఖాళీగా ఉన్నాయి. అయితే నేడు మాత్రం భక్తుల రద్దీతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. భక్తులు అధికంగా తమిళనాడు నుంచి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, ఏపీకి చెందిన భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వసతి గదులకు కూడా ఇబ్బంది ఏర్పడింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 59,522 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,544 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.51 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుంది. రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో మరింత రద్దీ పెరిగే అవకాశముంది.