Michaung Cyclone : తీరాన్ని తాకిన మిచౌంగ్
మిచౌంగ్ తుఫాను తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు
మిచౌంగ్ తుఫాను తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ధృవీకరించారు. మరో గంట వ్యవధిలో తుఫాను పూర్తిగా తీరాన్ని దాటనుందని చెప్పారు. తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీరం తాకే సమయంలో...
తుఫాను తీరం తాకే సమయంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. పెద్దయెత్తున ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. విద్యుత్తును అధికారులు నిలిపేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.