Pawan Kalyan : వైసీపీకి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చిన పవన్

వైసీపీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా వ్యవహరించిన తీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు;

Update: 2025-02-24 07:26 GMT
pawan kalyan, deputy chief minister, visit, gannavaram
  • whatsapp icon

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా వ్యవహరించిన తీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు 21 స్థానాలున్నాయని, వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయన్నారు. ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆయన అన్నారు.

ఎవరో ఇచ్చేది కాదని...
ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని అన్నారు. పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా రాదని పవన్ కల్యాణ్ తెలిపారు. నిబంధనల మేరకే స్పీకర్ నడుచుకుంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. స్థాయికి తగినట్లుగా వైసీపీ నేతలు వ్యవహరించాలని పవన్ కల్యాణ్ అన్నారు. తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రొటోకాల్ ను బ్రేక్ చేయనని అన్నారు. చంద్రబాబు ఇవ్వడం కాదని, ప్రజలే ప్రతిపక్ష హోదా రాదని పవన్ కల్యాణ్ అన్నారు.


Tags:    

Similar News