Pawan kalyan : కడపలో పవన్ ఏం చేశారంటే?
కడపలో మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్ టీచర్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు
కడపలో మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్ టీచర్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయన కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నేరుగా మున్సిపల్ హైస్కూలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దయెత్తున స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారికి ఎదురవుతున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
తల్లిదండ్రులతో ముచ్చటించి....
అలాగే తల్లిదండ్రులతో కూడా ముచ్చటించారు. ఎలాంటి సవాళ్లు ప్రభుత్వ స్కూళ్లలో ఎదురవుతున్నాయన్న విషయంపైఆరా తీశారు. ఉపాధ్యాయులను కూడా వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగోలి కార్యక్రమాన్నిఆయన తిలకించారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కడప విమానాశ్రయం నుంచిమున్సిపల్ హైస్కూలు వరకూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానుల తాకిడి లేకుండా జాగ్రత్త పడ్డారు.