ఎల్లుండి అన్నమయ్య జిల్లాకు పవన్ కల్యాణ్

ఈనెల 23వ తేదీన అన్నమయ్య జిల్లాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

Update: 2024-08-21 04:12 GMT

ఈనెల 23వ తేదీన అన్నమయ్య జిల్లాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రైల్వే కోడూరు,రాజంపేట పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎల్లుండి రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరా వారి పల్లి చెరుకోనున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు.

గ్రామ సభలో...
అనంతరం రోడ్డు మార్గాన రాజంపేట నియోజకవర్గం చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అన్నమయ్య ప్రాజెక్టు ను పవన్ కల్యాణ్ పరశీలిస్తారు. అనంతరం తర్వాత పులపత్తూరు గ్రామాల ను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. గ్రామ ప్రజలతో సమవేశమై సమస్యలపై చర్చిస్తారు. తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం చేరుకుంటారు.


Tags:    

Similar News