నేడు కర్నూలు జిల్లాకు పవన్

నేడు, రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.;

Update: 2025-01-09 03:39 GMT

నేడు, రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నేడు ఓర్వకల్లు మండలంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గుమ్మితం తండా గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. ఎనర్జీ ప్రాజెక్టుల పలు విభాగాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు.

పోలీసుల భారీ బందోబస్తు...
అయితే పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా అభిమానులు పెద్దయెత్తున తరలి వస్తారని భావించి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పవన్ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు స్థానిక జనసేన నేతలతో ఆయన సమావేశమవుతారని తెలిసింది. పవన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags:    

Similar News