రాజన్నదొర.. కమ్మ, రెడ్లపై కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు;

Update: 2023-05-08 05:35 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సెటిలర్ల వల్లనే సాలూరు ప్రాంత పరిధిలోని స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఒక సమావేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

వారి వల్లనే...
చౌదరి, రెడ్ల వల్లనే ఎక్కువ సాలూరు ప్రాంతానికి నష్టం జరుగుతుందని రాజన్న దొర అభిప్రాయపడ్డారు. ఆ రెండు సామాజికవర్గాల వారి చేతుల్లోనే భూములు ఉండిపోయాయని ఆయన అన్నారు. వ్యాపారాలు కూడా వారే నిర్వహిస్తున్నారని, గిరిజనుల మీద ఆధారపడి బతుకుతూ, వారికే అన్యాయం చేస్తున్నారన్నారు. అభివృద్ధికి మాత్రం సహకరించడం లేదని రాజన్న దొర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Tags:    

Similar News