Tirumala : రష్ మామూలుగా లేదు.. బయట వరకూ క్యూ లైన్
వీకెండ్ కావడం, మూడు రోజుల నుంచి వరస సెలవులు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు.;
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వీకెండ్ కావడం, మూడు రోజుల నుంచి వరస సెలవులు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు ఆదివారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులు స్వామి వారి దర్శనం చేసుకునేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆదాయం మాత్రం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ ఉంది. అక్కడ వరకూ భక్తులు క్యూలో ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో ఉదయ ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేవించిన భక్తులకు దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,412 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమ శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్ల రూపాయలు వచ్చింది.