మూడు రోజులు ఏపీలో వర్షాలు

మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

Update: 2023-05-06 03:29 GMT

మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

పిడుగులు పడే...
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. రైతులు పొలాల్లోకి వెళ్లవద్దని, చెట్ల కింద ఉండవద్దని సూచించింది. పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది.


Tags:    

Similar News