ఏపీ వాసులకు హెచ్చరిక...ఈరోజు, రేపు తీవ్ర వడగాలులు
ఈరోజు పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
ఈరోజు పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో పాటు 130 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రేపు ఐదు మండలాల్లో తీవ్రమైన, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
బయటకు రాకుండా...
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని కోరారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.