ఏపీలో పాస్ పోర్టులు జారీకి ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్
పాస్ పోర్టు కావాలనుకుంటున్నారా? అయితే ప్రభుత్వం మీకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.;

పాస్ పోర్టు కావాలనుకుంటున్నారా? అయితే ప్రభుత్వం మీకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాస్ పోర్ట్ సేవలకు పెరిగిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రోజుకు విజయవాడ సేవా కేంద్రంలో 800, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లను శనివారం విడుదల చేశారు.
రీ షెడ్యూల్ కు...
ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్ మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే కాకుండా ఏప్రిల్లో ప్రతి బుధవారం విజయవాడ సేవా కేంద్రంలో 750 అదనపు అపాయింట్మెంట్లతో రెగ్యులర్ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. విజయవాడలో 800, తిరుపతిలో 500 స్లాట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది.