డెలివరీకి వచ్చిన మహిళకు ఆపరేషన్‌.. కడుపులో కత్తెర వదిలేసిన వైద్యులు

ఓ మహిళకు చేసిన ఆపరేషన్‌ ప్రాణాల మీదకువచ్చింది. ఇంత నిర్లక్ష్యంపు వైద్యులపై ఇప్పుడు ధ్వజమెత్తుతున్నారు రోగులు. ఏపీలోని..

Update: 2023-08-17 04:16 GMT

ఓ మహిళకు చేసిన ఆపరేషన్‌ ప్రాణాల మీదకువచ్చింది. ఇంత నిర్లక్ష్యంపు వైద్యులపై ఇప్పుడు ధ్వజమెత్తుతున్నారు రోగులు. ఏపీలోని ఏలూరులో బోధన ఆస్పత్రిలో వైద్యులు చేసిన ఘన కార్యానికి రోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన చోటు చేసుకుంది. మహిళకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర వదిలేసి కుట్ల వేయడంతో ఆమెకు తీవ్ర కడుపు నొప్పితో అనారోగ్యానికి గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై అక్కడి వైద్యులు స్పందించారు.

ఆగస్టు 10వ తేదిన ఏలూరు నుంచి స్వప్న అనే మహిళను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. అయితే సర్జికల్ ఫోర్‌సెప్ (కత్తెర)ను ఆమె కడుపులోనే వదిలేశాని పేర్కొన్నారు. ఆ కత్తెర పొడవు రెండు ఇంచుల వరకు ఉందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో వదిలేసిన కత్తెర పేగకి అతుక్కుపోవడంతో ఆమెకు కడుపు నొప్పి తీవ్రమైంది. దీంతో కత్తెర అతుక్కుపోయిన పేగు కుళ్లిపోయిందని అన్నారు. , ప్రస్తుతం ఆ కుళ్లిపోయిన పేగును తీసేసి చికిత్స నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. దీంతో మహిళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రభాకర్‌, సర్జరీ విభాగాధిపతి అప్పారావులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే..పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి అనే గ్రామానికి చెందిన స్వప్న ప్రసవం కోసం ఏప్రిల్ 19వ తేదిన బోధనాసుపత్రిలో చేరింది. అయితే గర్భిణీతో ఉన్న ఆమెకు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే మహిళకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె పరిస్థితి ఆందోళకరంగా మారిందని వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేసిన తర్వాత డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిపోయిన స్వప్నకు తరచుగా కడుపు నొప్పి వచ్చేది. ఇలా నొప్పులు వచ్చినప్పుడు సాధారణంగా వచ్చే నొప్పులు ఏమో అనుకుని మందులు వాడేది. అయితే ఆగస్టు 8వ తేదిన స్వప్నకు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో తిరిగి ఏలూరులోని బోధనాసుపత్రికే వెళ్లింది. కానీ అక్కడ వైద్యులు ఆమెకు పరీక్షలు చేసిన తర్వాత విజయవాడలోని ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దీంతో అక్కడ ఆమెను పరీక్షించగా అసలు విషయం బయటకు వచ్చింది. స్వప్న కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా బయటపడింది.

అయితే సర్జరీ కోసం వినియోగించినటువంటి కత్తెరను తెలియకుండానే కడుపులో ఉంచి కుట్లు వేసేయడం జరిగింది. అయితే ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ అడగా అందుకు ఆయన ఇది వాస్తవమేనని, ఈ విషయంపై విచారణ చేపడుతున్నామని, బాధ్యుతలైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ కూడా స్పందించారు. దీంతో వెంటనే ఈ ఘటనపై విచారణ కమిటీ వేయించారు. బాధ్యుడైన వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చారు.

Tags:    

Similar News