ఏపీలో ముందస్తు అరెస్ట్ లు... ఉద్యోగ సంఘాల నేతల?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనకు దిగారు

Update: 2022-01-20 04:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలంటూ వారు నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఫ్యాప్టో ఆధ్యర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కి పిలుపు నివ్వడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్యోగ సంఘాల నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.

నోటీసులను....
నోటీసులను అతిక్రమించి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు కొందరు ఉద్యోగ సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ లు చేశారు. తాము మాత్రం కలెక్టరేట్లను ముట్టడించి తీరుతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News