భేటీ తర్వాతనే స్పష్టత.. ఈరోజు ఉద్యోగ సంఘాలతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నేడు ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యే అవకాశముంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నేడు ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యే అవకాశముంది. పీఆర్సీ నివేదికపై జగన్ ఉద్యోగ సంఘాల నేతలలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికపై 76 గంటల్లో జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ రోజు సాయంత్రానికి ఆ సమయం పూర్తి కానుండటంతో మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో జగన్ భేటీ అవుతారు.
ఫిట్ మెంట్ పై...
ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తమ వాదనను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విన్పించారు. 34 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. మధ్యే మార్గంగా 27 లేదా 30 శాతం వరకూ జగన్ ఫిట్ మెంట్ ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. జగన్ తో భేటీ అయిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.