ఏపీలో ఉద్యోగ సంఘాల ఆందోళన విరమణ
ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనలను విరమించాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.
ఏపీలో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనలను విరమించాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నెల 7వ తేదీ నుంచి వివిధ రూపాలలో ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పీఆర్సీ తదితర అంశాలపై ప్రభుత్వం రెండు, మూడు రోజుల నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వస్తుంది.
తాత్కాలికంగానే....
బహుశ సోమవారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో సమ్మె విరమించాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సంఘాలు ఆందోళనను విరమించాయి. జగన్ వద్దకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వెళ్లడం సరికాదని చెప్పడంతో అందుకు సంఘాలు కూడా అంగీకరించాయి. అయితే ఆందోళనను తాత్కాలికంగానే వాయిదా వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తో చర్చల తర్వాత తమ కార్యాచరణను తిరిగి ప్రకటిస్తామని చెబుతున్నారు.