పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు
ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినా ఆందోళనను విరమించేది లేదని ఉద్యోగసంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినా ఆందోళనను విరమించేది లేదని ఉద్యోగసంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తమ 71 డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. ఉద్యోగులు నిర్వహిస్తున్న సింహగర్జన కార్యక్రమానికి అమరావతి జేఏసీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మట్లాడారు.
సీపీఎస్ ను రద్దు చేస్తామని....
సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన జగన్ మూడేళ్లవుతున్నా దానిని పట్టించుకోవడం లేదన్నారు. పీఆర్సీ తో పాటు పెండింగ్ డీఏ, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందేనన్నారు. అప్పటి వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.