జగన్ కమిటీతో చర్చలు జరపం

జగన్ కమిటీతో చర్చలు జరిపే అవకాశం లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు.

Update: 2022-01-21 14:39 GMT

జగన్ కమిటీతో చర్చలు జరిపే అవకాశం లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ముందుగా ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన జీవోను రద్దు చేస్తేనే చర్చలకు వెళతామని చెబుతున్నారు. అప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎవరు చర్చలకు పిలిచినా వెళ్లేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలన్నది వారి ప్రధాన డిమాండ్. జీవో రద్దయ్యేంత వరకూ చర్చలకు వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు.

జీవోను రద్దు చేస్తేనే....
ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెచ్చిన ఉత్తర్వులను ఈరోజు కేబినెట్ ఆమోదించింది. అంటే ప్రభుత్వం తాను ప్రకటించిన పీఆర్సీ, హెచ్ఆర్ఏ తోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లయింది. అయితే ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు జగన్ ఒక కమిటీని నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సభ్యులుగా కమిటీని నియమించారు. అయితే ఈ కమిటీ చర్చలకు పిలిచినా వెళ్లేది లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News