నేడు ఏపీ ప్రభుత్వానికి నోటీసు
ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ నోటీసులను జారీ చేయనున్నాయి
ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ నోటీసులను జారీ చేయనున్నాయి. పీఆర్సీ నివేదికను ఇంతవరకూ బయట పెట్టకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపారు.
సమస్యలపై....
పీఆర్సీ నివేదిక వెల్లడి, డీఏ బకాయీల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ స్పందించకపోవడంతో ఈరోజు సీఎస్ కు నోటీసులు ఇవ్వనున్నారు. డిసెంబరు 7 నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.