2024 కు కూడా పోలవరం పూర్తికాదు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు

Update: 2022-07-20 08:18 GMT

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్ కు ఒక ప్రణాళిక లేదని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే 2024 నాటికి కూడా పోలవరం పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదని దేవినేని ఉమ అన్నారు. డయాఫ్రం వాల్ అంటే తెలియని అంబటి రాంబాబు, మంత్రులు, ప్రతి ఒక్కరూ పోలవరం గురించి మాట్లాడుతున్నారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తిచేయాలో కూడా ముఖ్యమంత్రి జగన్ కు తెలియదని దేవినేని ఉమ మండి పడ్డారు.

సిగ్గుతో తలదించుకోవాలి....
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పీపీఏ రీఎంబర్స్ మెంట్ చేస్తే డబ్బులను ప్రాజెక్టుకు వాడకుండా మళ్లించారన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో దాదాపు 21 వేల కోట్ల రూపాయలను వృధా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుందని దేవినేని ఉమ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో నేడు నాసిరకం పనులు జరుగుతున్నాయని దేవేనేని ఆరోపించారు. గడచిన మూడేళ్ల కాలంలో పోలవరం పనులను ఏడు శాతం కూడా పూర్తికాలేదని ఆయన అన్నారు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు.


Tags:    

Similar News