నారాయణకు హైకోర్టులో చుక్కెదురు

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నారాయణను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Update: 2022-11-16 12:38 GMT

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నారాయణను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటిలోనే విచారించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మాజీ మంత్రి నారాయణను సీఐడీ పోలీసులు విచారణ చేసే అవకాశముంది.

విచారించవచ్చని....
అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయని సీఐడీకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చారు. దీంతో ఈ కేసులో విచారించేందుకు నారాయణకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై నారాయణ హైకోర్డును ఆశ్రయించారు. అయితే నారాయణ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ నారాయణను విచారించవచ్చని పేర్కొంది.


Tags:    

Similar News