హైకోర్టులో నారాయణకు చుక్కెదురు

టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.;

Update: 2022-12-06 11:39 GMT

టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రివిజన్ పిటీషన్ కు అర్హతలేదన్న నారాయణ తరుపున న్యాయవాది వాదనను హైకోర్టు తిరస్కరించింది. కేసు పూర్వాపరాలను అనుసరించి తిరిగి విచారణ జరపవచ్చని సెషన్స్ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును...
నారాయణ పదో తరగతి పరీక్షల సందర్భంగా లీకేజీకి పాల్పడి తీవ్ర తప్పిదం చేశాడని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని కోరారు. నారాయణను విచారించి మరోసారి ఈ తప్పిదం జరగకుండా ఉండేందుకు న్యాయస్థానం కూడా సహకరించాలని న్యాయవాది కోరారు.


Tags:    

Similar News