మాజీ మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట

మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నారాయణ బెయిల్ రద్దుకు సుప్రీం నో చెప్పింది;

Update: 2022-11-07 12:27 GMT

మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నారాయణ బెయిల్ రద్దుకు సుప్రీం నో చెప్పింది. ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయడానికి నిరాకరించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటే నారాయణపై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడంతో హైకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ ను తెచ్చుకున్నారు.

బెయిల్ రద్దు...
దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ కోసం నారాయణ బెయిల్ ను రద్దు చేయాలంటూ కోరింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, భూసేకరణలో అనేక మార్పులు చేశారని, ఇందులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంటుంది.


Tags:    

Similar News