జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి ఫైర్

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2024-12-03 07:37 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆయన తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలను ఆపేందుకు తాను ఎప్పటికైనా సిద్ధమని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు.

తాడిపత్రికి రానివ్వకుండా...
తనను కూడా తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. తాడిపత్రి ప్రజలు జేసీ ప్రభాకర్ రెడ్డి నియంతృత్వ ధోరణికి విసిగిపోయి ఉన్నారన్నారు. తాను తాడిపత్రిలో అడుగు పెట్టి తీరతానని చెప్పారు. పోలీసులు శాంతిభద్రతల సమస్య పేరుతో అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.


Tags:    

Similar News