నేడు హైకోర్టుకు రాజధాని రైతులు

రాజధాని అమరావతి రైతులు నేడు హైకోర్టును ఆశ్రయించనున్నారు;

Update: 2021-12-13 01:47 GMT

రాజధాని అమరావతి రైతులు నేడు హైకోర్టును ఆశ్రయించనున్నారు. తమకు తిరుపతిలో బహిరంగ సభ జరుపుకునేందుకు అనుమతివ్వాలని కోరనున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు గత నలభై రోజులకు పైగానే మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఈ నెల 16వ తేదీ తిరుమల శ్రీవారి దర్శనంతో ముగియనుంది. తిరుపతిలో 17వ తేదీన బహిరంగ సభను నిర్వహించాలని రాజధాని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది.

అన్ని పార్టీల నేతలను...
ఈ మేరకు రైతు సంఘం నేతలు రాకేష్ టికాయత్ తో సహా పలువురు పార్టీల నేతలను ఆహ్వానించారు. చంద్రబాబు కూడా ఈ సభకు హాజరు కావాలనుకుంటున్నారు. కానీ పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతులు ఈరోజు హైకోర్టును ఆశ్రయించి తమ సభకు అనుమతిప్పించాలని కోరనున్నారు.


Tags:    

Similar News