Posani Krishna Murali : నేడు పోసాని కృష్ణమురళి విడుదలయ్యే ఛాన్స్
సినీనటుడు పోసాని కృష్ణమురళి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది;

సినీనటుడు పోసాని కృష్ణమురళి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. నిన్న గుంటూరు జిల్లా కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇవ్వడంతో నేడు ఆయన విడుదల కానున్నారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఆయన ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు.
సీఐడీ కేసులో...
పోసాని కృష్ణమురళిపై వరసగా కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసులో బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.