భయపడను.. లొంగను.. విడదల రజనీ రెస్పాన్స్
తనపై నమోదయిన కేసులపై మాజీ మంత్రి విడదల రజనీ స్పందించారు.;

తనపై నమోదయిన కేసులపై మాజీ మంత్రి విడదల రజనీ స్పందించారు. తనపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదిగితే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. తనపై నమోదయిన కేసులన్నీ అక్రమ కేసులేనని, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసులు నమోదు చేశారని విడదల రజని అన్నారు.
అక్రమ కేసులకు...
అక్రమ కేసులకు తాను భయపడనని, న్యాయపోరాటం చేస్తానని విడదల రజనీ తెలిపారు. ఆధారాలు లేకుండా తనపై కేసులు నమోదు చేశారంటూ విడదల రజనీ ధ్వజమెత్తారు. కేసులకు భయపడి తాను రాజకీయంగా లొంగిపోనని తెలిపారు. తాను వైసీపీలోనే ఉంటూ పోరాటం సాగిస్తానని విడదల రజనీ స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని విడదల రజనీ అన్నారు.