డీలిమిటేషన్ మీటింగ్ ఒక డ్రామా

దక్షిణాదిన బీజపీ బలోపేతం అవుతుందని భావించి అందరూ ఒక్కటయ్యారని రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నారు;

Update: 2025-03-23 06:09 GMT
k. laxman, rajya sabha member, south, delimitation
  • whatsapp icon

దక్షిణాదిన బీజపీ బలోపేతం అవుతుందని భావించి అందరూ ఒక్కటయ్యారని రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల డీ లిమిటేషన్ సమావేశం ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నందున తాను విజయం సాధించడానికి స్టాలిన్ కొత్త ఎత్తుగడ డీ లిమిటేషన్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇద్దరూ ఒక్కటయి...
డీ లిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయదని, సీట్ల సంఖ్య కూడా తగ్గదని అమిత్ షా చెప్పిన విషయాన్ని లక్ష్మణ్ గుర్తు చేశారు. డీలిమిటేషన్ సమావేశంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటయ్యాయని అన్నారు. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం డీ లిమిటేషన్ డ్రామాను తెరపైకి తెచ్చారని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News