నేడు అమరావతి వాసులతో సీఆర్డీఏ సమావేశం
నేడు రాజధాని అమరావతి వాసులతో సమావేశానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది.;

నేడు రాజధాని అమరావతి వాసులతో సమావేశానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. సీఆర్డీఏ అధికారులు రాజధాని అమరావతి ప్రజలతో సమావేశమై రాజధాని నిర్మాణ పనులకు సహకరించాలని, మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.
సహకారం అందించాలని...
ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన కార్యక్రమం దగ్గర నుంచి పనులు పూర్తయ్యేంత వరకూ సహకారం అందించాలని అమరావతి వాసులను సీఆర్డీఏ అధికారులు అడగనున్నారు. దీంతో పాటు రాజధాని నిర్మాణంలో సహకారం, భాగస్వామ్యం అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాజధాని అమరావతి ప్రాంత సమగ్ర అభివృద్ధిలో స్థానికుల భాగస్వామ్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని సీఆర్డీఏ రూపొందించింది.